మంచేరియల్, 2026-07-30
ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకై కార్యక్రమాలు చేపట్టి ఒత్తిడి తేవడంలో బీసీ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు విఫలమయ్యారని, వారు తమ అసమర్థతను ప్రదర్శిస్తున్నారని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పేరం అలేఖ్య తీవ్రంగా విమర్శించారు. ఇది 80 కోట్ల బీసీ కులాల సమాజానికి తీరని అన్యాయమని ఆమె అన్నారు.
బీసీ సంఘాల జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు తమ అసమర్థతను ప్రదర్శిస్తున్నారని, ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకై కార్యక్రమాలు చేపట్టి ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పేరం అలేఖ్య తీవ్రంగా విమర్శించారు.
గత కొన్ని సంవత్సరాలుగా శీతాకాల, వర్షాకాల, బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధనకై చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు, మొన్న జులై 20వ తేదీ నుండి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏ బీసీ జాతీయ, రాష్ట్ర స్థాయి సంఘాలు కార్యక్రమాలు చేపట్టడానికి వెనకడుగు వేయడం 80 కోట్ల బీసీ కులాల సమాజానికి తీరని అన్యాయమని ఆమె అన్నారు.
గత దశాబ్ద కాలంలో ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘం, జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం, దాసు సురేష్ రాష్ట్ర బీసీ సంఘం, చిరంజీవులు మాజీ ఐఏఎస్ గారి బీసీ సంఘం, ఆల్ల రామకృష్ణ బీసీ సంఘం, జక్కని సంజయ్ కుమార్ బీసీ సంఘం వంటివి ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కార్యక్రమాలు చేపట్టి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించాయని, కానీ ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అన్ని బీసీ సంఘాలు 'గుడ్లు తేలేసినట్లు' వ్యవహరించాయని ఆమె విమర్శించారు.
80 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో సరైన రిజర్వేషన్లు దక్కక కునారిల్లుతున్న 80 కోట్ల బీసీ కులాల జనాభాకు మోక్షం కలుగుతుందన్న ఆశలో ఉన్న సమాజానికి బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమం చల్లబడిపోవడం 'శరాఘాతం' లా ఉందని అలేఖ్య పేర్కొన్నారు. ఇది భారత దేశంలోని బీసీ కులాల సమాజానికి 'వెన్ను పోటు పొడిచినట్లుగా' ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇంత అసమర్థ నాయకులు ఉద్యమాన్ని ముందుకు తెచ్చి, భారత దేశ బీసీ కులాల సమాజంలో ఆశలు చిగురింపజేసి, ఇప్పుడు వెన్ను చూపడం పిరికితనం, నాయకత్వపు లక్షణాలు కావని ఆమె ప్రశ్నించారు. మీ సంఘాల కన్నా విషారధన్ మహారాజ్ సంఘం, నాయకత్వం గత దశాబ్ద కాలంగా అనేక పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టి అలసిపోకుండా ఉద్యమం కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంగా ఏర్పడి కార్యక్రమాలు చేపట్టడంలో మీ శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేనందున, అన్ని జాతీయ, రాష్ట్ర బీసీ సంఘాల నాయకులు ఒక్కటై బీసీ రిజర్వేషన్ల సాధనలో సమైక్యంగా పోరాటం చేయడమే మీకు ముందున్న భవిష్యత్తుకు చక్కని కార్యక్రమమని, ఈ విధంగా చేపట్టనినాడు మీకు చాలా చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. మీ తప్పును సవరించుకొని అన్ని బీసీ సంఘాలు ఒక్కటై బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలేఖ్య అన్నారు.












