మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ టాగూర్ స్టేడియం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ టాగూర్ స్టేడియం వద్ద గాంధీజీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సోదరభావం, సమానత్వం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, వివిధ మతాలు, కులాలు, భాషలతో విలసిల్లే సుసంపన్నమైన దేశమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు.
అదేవిధంగా ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి భారతీయుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కూతురు ప్రభాకర్, గుర్రం శ్రీనివాస్, దాముక శిరీష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రాజు, యాకుబ్ అలీ, నాయకులు ఏల్పుల సత్యనారాయణ, నక్క శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్, బొద్దుల ప్రేమ్ సాగర్, ఎర్రబెల్లి రాజేష్, గోపు రాజం, మేకల సురేందర్, కనకయ్య, బైర మల్లేశం, రామస్వామి, నాగుల రాజ్ కుమార్, ఇబ్రహీం, కాసర్ల ప్రకాష్, రామ్ సాయి, పైడాకుల శ్రీనివాస్, విజ్జగిరి శ్రీనివాస్, రాజన్న, మహిళా నాయకురాళ్ళు కొలిపాక దీప, దాసరి లక్ష్మి, శనిగారపు అనూష తదితరులు పాల్గొన్నారు.

