జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ వైభవంగా నిర్వహించారు. జనసేన ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా కో ఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ పార్టీ కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ చేశారు.
జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ వైభవంగా నిర్వహించారు. జనసేన ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా కో ఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ పార్టీ కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం బంధీల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు 1947 వరకు వేచి చూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన ఉద్యమ ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని కొనియాడారు. ఈ పోరాటంలో తెలంగాణ, మరఠ్వాడా, కర్ణాటక ప్రాంత ప్రజల త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు అవునూరి రమేష్, ఆవుల సాగర్, పిట్టల సంధ్య, కమ్మరి హర్షిత, పిట్టల సుధాకర్, అర్షనపల్లి చరణ్, మేకల పవన్, ఆవుల శ్రవణ్, చిప్పకుర్తి రంజిత్, హర్షిత్, నవీన్, మాడుగుల నవీన్, బొంగు సుధీర్, చిప్పకుర్తి సంపత్, రుద్రపు సాయి కిరణ్, చిప్పకుర్తి శివ, వర్ధన్, వంశీ, క్రాంతి, శివ, గుణవర్ధన్ బత్తిని, సంపత్, బొల్లి సృజన్, కార్తీక్, మారుతి తదితరులు పాల్గొన్నారు.










