మంచేరియల్, 13 October
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రజా భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు ప్రజా భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయ రమణ రావు, ఎమ్మెల్యేలు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, శ్రీ రాజ్ ఠాకూర్, తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొని సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడం ద్వారా వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. సంస్థ అభివృద్ధిలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకమని గుర్తిస్తూ వారికి ప్రయోజనాలు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
15 రోజుల్లో పెండింగ్ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, కార్మికుల పిల్లలకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.











