పెద్దపల్లి, 2026-11-20
పెద్దపల్లి జిల్లా లింగాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ లో నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆంగోతు శ్రీనివాస్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
పెద్దపల్లి జిల్లా లింగాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆంగోతు శ్రీనివాస్ విద్యార్థినీ విద్యార్థులచే జల ప్రతిజ్ఞ చేయించారు. నీరు మన జీవనాధారమని, ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావించి వృథా చేయకుండా కాపాడుకోవాలని ప్రిన్సిపాల్ ఆంగోతు శ్రీనివాస్ సూచించారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి వనరులను పరిరక్షించడం వంటి చర్యల ద్వారా భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆంగోతు శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఎం. రాజ్ కుమార్, సౌజన్య, నాగవేణి, శ్యామల, స్వరూప, వెంకటస్వామి, ఎం. స్వరూప, సూర్యభగవాన్, సునీత దత్తా, రోజినా, అఖిల్, శ్రీలత, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



