Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 18
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామంలోని ప్రాణహిత నది వద్ద శనివారం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టును వెంటనే నిర్మించి, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామంలోని ప్రాణహిత నది వద్ద శనివారం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించాలని నినాదాలు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని వక్తలు కోరారు. రెండు జిల్లాల రైతుల జీవనాధారం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉందని, ఆలస్యం చేస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ టి శ్రీనివాస్, సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోమాస ప్రకాష్, జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నయనాల గోవర్ధన్, టిపి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి జైపాల్ సింగ్ పాల్గొన్నారు.
అదేవిధంగా సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్, సిపిఎం కొమరం భీం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ ముంజం ఆనంద్ కుమార్, సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మేకల దాసు, వామపక్ష నాయకులు లాల్ కుమార్, మంగ శ్రీనివాస్, శంకర్, సింత తదితరులు పాల్గొని ప్రసంగించారు.










