ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన జనగాం భాస్కర్ కుటుంబానికి సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు.
రామకృష్ణాపూర్ 18వ వార్డుకు చెందిన జనగాం భాస్కర్, ఒక ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. భాస్కర్ ఇద్దరు చిన్న పిల్లల తండ్రి.
మంచిర్యాలలో మొబైల్ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భాస్కర్ మరణం, కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. ఆయన కుటుంబానికి సహాయం చేయాలని కోరుతూ, ఆయన పనిచేసిన షాప్ వారు సిరి ఫౌండేషన్‌ను సంప్రదించారు.
సిరి ఫౌండేషన్, దాతల సహకారంతో రూ. 10,000 సేకరించి, మృతుని కుటుంబానికి అందజేసింది. ఫౌండేషన్ సభ్యులు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సరిగమల తిరుపతి, అధ్యక్షుడు కడగొండ సాయి కుమార్, సభ్యులు ఉప్పు శేఖర్, సచిన్, నవీన్, రామ్, బీఆర్ఎస్ యూత్ నాయకులు రామిడి లక్ష్మి కాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.












