మంచేరియల్, 2026-07-17
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షీ టీం ఎస్ఐ ఉషా రాణి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడం షీ టీం కర్తవ్యమని, సమస్యలుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షీ టీం ఎస్ఐ ఉషా రాణి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షీ టీం కర్తవ్యమని తెలిపారు. మహిళలు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సంబంధిత విభాగాలకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు. ఆకతాయిల వేధింపుల నుండి మరి ఏ ఇతర ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నంబర్ కు సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని, అలా ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రవణ్, వనిత, పాఠశాల హెడ్ మాస్టర్, విద్యార్థులు పాల్గొన్నారు.












