మంచేరియల్, 2026-11-26
వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా, 2029 నాటికి దేశాన్ని డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చే సంకల్పంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కూడా పాల్గొన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2029 లోగా దేశాన్ని డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హైదరాబాద్లోని అంబర్పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు 30 కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు నషా ముక్త్ భారత్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా, ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు కిషన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు.







