Hunasagi, 2026-11-23
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, భోజనం నాణ్యత, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అనే విషయాలను ఆరా తీశారు.
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



