మంచేరియల్, 4 August
భారీ వర్షాలు, వరద ఉదృతి కారణంగా దెబ్బతిన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ పునరుద్ధరణ పనులను మేయర్ దర్ని మధుకర్ పరిశీలించారు.
భారీ వర్షాలు, వరద ఉదృతి కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతినడంతో పాటు, పునరుద్ధరణ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది.
వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గారు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించారు.
వరద ఉదృతి తగ్గిన తర్వాత పనులు వేగవంతం చేసినప్పటికీ, మళ్ళీ నిన్న రాత్రి కురిసిన వర్షాలకు వరద ప్రవాహం పెరిగి పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాలతో ఆధునిక చైన్ jcb ల సహాయంతో వరద నీటి ప్రవాహాన్ని మళ్ళించి పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నది.
అధికారులు, సిబ్బంది సమన్వయంతో పైపులైన్ మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలని మేయర్ గారు ఆదేశించారు. నగర ప్రజలకు తాగునీటి సరఫరా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేస్తూ అక్కడే ఉండి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరాను త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మేయర్ దర్ని మధుకర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి, నంబయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, DE రాజేందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.











