మంచిర్యాల డీసీపీ శ్రీ ఏ.భాస్కర్, కాసిపేట్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, అక్కడి సిబ్బంది పనితీరును సమీక్షించారు.
డీసీపీ, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రిసెప్షన్ మరియు ఐటీ విభాగం పనితీరును సమీక్షించారు. అలాగే, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా, బాధితుల ఫిర్యాదులపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని డీసీపీ సూచించారు. ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు.
ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చైతన్యం తీసుకురావాలని డీసీపీ సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, వాటి ఏర్పాటుకు ప్రోత్సహించాలని సూచించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు.











