పెద్దపల్లి, 2026-08-17
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జఫర్ ఖాన్ పేట గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన మద్దెల వాగు హై లెవెల్ బ్రిడ్జిని, గోదావరిఖని జఫర్ ఖాన్ పేట పెద్దపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును, పలు సీసీ రోడ్లను ప్రభుత్వవిప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు జెండా ఊపి ప్రారంభించారు. రూ. 5.43 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక అధికారులు, నాయకులు హాజరయ్యారు.

గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం
ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మాట్లాడుతూ, గతంలో గ్రామంలో రోడ్లు లేక, పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. నేడు లక్షల రూపాయల నిధులతో పాఠశాల పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు గ్రామంలోని అన్ని వీధులకు సిసి రోడ్లు పూర్తి చేశామన్నారు. రూ. 5.43 కోట్లతో మద్దెల వాగు బ్రిడ్జిని పూర్తి చేయడమే కాకుండా, అప్రోచ్ రోడ్లకు అదనంగా మరో కోటి రూపాయలు ఖర్చు చేసి రవాణా కష్టాలను తీర్చామని తెలిపారు. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సు సేవలను కూడా జెండా ఊపి ప్రారంభించామని, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గానికి రహదారుల మహర్దశ
పెద్దపల్లి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే విజయ రమణారావు వెల్లడించారు. ముత్తారం, మంథని వెళ్లే ప్రయాణికుల చిరకాల వాంఛను తీరుస్తూ మంగపేట కూనారం టర్నింగ్ నుండి ముత్తారం వరకు రూ. 32 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించామని తెలిపారు. అలాగే పెద్దపల్లి గర్రెపల్లి మేజర్ రోడ్డుకు రూ. 100 కోట్లు, సుల్తానాబాద్ పెద్దపూర్ రోడ్డుకు రూ. 47 కోట్లు, కూనారం పెద్దపల్లి రోడ్డుకు రూ. 14 కోట్లు, జఫర్ ఖాన్ పేట్ రింగ్ రోడ్డుకు రూ. 7 కోట్లు, శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ సెంట్రల్ లైటింగ్‌కు రూ. 5.5 కోట్లు నిధులు మంజూరయ్యాయని వివరించారు.
ఆగస్టు 17న శంకుస్థాపనల ఉత్సవం
ఈ అభివృద్ధి పనులన్నింటికీ ఆగస్టు 17న సుల్తానాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ మండలం మరియు నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, సోదరీమణులు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున సుల్తానాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.