లక్షెట్టిపేట్ (ప్రజావార్త) ఆగస్టు 25
లక్షెట్టిపేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో జప్తు చేయబడిన ఆరు ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం కార్యక్రమం ఆగస్టు 27, 2026 రోజున ఉదయం 11 గంటలకు లక్షెట్టిపేట్ ఎక్సైజ్ స్టేషన్ నందు నిర్వహించబడుతుంది.
లక్షెట్టిపేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో జప్తు చేయబడిన ఆరు ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం కార్యక్రమం ఆగస్టు 27, 2026 రోజున ఉదయం 11 గంటలకు లక్షెట్టిపేట్ ఎక్సైజ్ స్టేషన్ నందు నిర్వహించబడుతుంది. మంచిర్యాల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో ఈ వేలం జరుగుతుంది.
వేలంలో పాల్గొనే విధానం
వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తిగలవారు నిర్దేశిత ధరావత్తు సొమ్మును చెల్లించి పాల్గొనవచ్చని లక్షెట్టిపేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ . సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను లక్షెట్టిపేట్ ఎక్సైజ్ స్టేషన్ లో తెలుసుకోవచ్చని ఆయన తెలియజేశారు.











