ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభంగా అభివర్ణించారు. హమాస్ దాడులను ఖండించిన ఐరాస అధికారులు.. అదే సమయంలో గాజా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కూడా ప్రస్తావించారు.

యుద్ధానికి ముగింపు పలికి శాశ్వత శాంతి, భద్రత, రాజకీయ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు తమ హక్కులు, భద్రత, గౌరవంతో జీవించే పరిస్థితులు ఏర్పడాలని పేర్కొన్నారు.
గాజాలో మానవతా సహాయం అందిస్తున్న సిబ్బందికి కూడా యుద్ధ పరిస్థితులు తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఐరాస తెలిపింది. సంఘర్షణలో పెద్ద సంఖ్యలో మానవతా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, సహాయక చర్యలు నిర్వహించడం క్లిష్టంగా మారిందని గుటెరస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఐరాస ప్రధాన సందేశం స్పష్టంగా ఉందిహింసకు బదులుగా దౌత్యపరమైన పరిష్కారం, మానవతా సహాయానికి అవకాశం, బందీల విడుదల, శాశ్వత శాంతి కోసం చర్యలు అవసరమని అంతర్జాతీయ సంస్థ పునరుద్ఘాటించింది.