అఖిల భారత మార్వాడీ యువ మంచ్, బెల్లంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు 31 రోజుల పాటు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శనివారం నాడు మొదలైంది.
తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేద్కర్ కాంటా చౌరస్తాలోని హనుమాన్ ఆగ్రోస్ దుకాణం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,150 గ్లాసుల మజ్జిగను పంపిణీ చేశారు.
యువ మంచ్ అధ్యక్షుడు కృష్ణకాంత్ సోని మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమానికి మద్దతునిచ్చిన దాతలకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువ మంచ్ సభ్యులు బాలు మారు, కమల్ లహోటి, అరవింద్ అగర్వాల్, రాజేందర్ లహోటి, అజయ్ లహోటి, దినేష్ సారడా తదితరులు పాల్గొన్నారు.








