అంతర్గాం, 13 November
మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన స్వయం పాలనా దినోత్సవంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను, బాధ్యతలను తాము స్వయంగా అనుభవించి తెలుసుకున్నామని అభిప్రాయపడ్డారు.
అనంతరం, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్యాలు, కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి.
ఈ సందర్భంగా పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ అంగోతు శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి విద్యార్థి తమ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, వినయ విధేయతలు, దేశభక్తి వంటి ఉన్నత భావాలను పెంపొందించుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పి.జి.టి . సబిత, ఉపాధ్యాయులు . రాజ్‌కుమార్, . సౌజన్య, . నాగవేణి, . శ్యామల, . స్వరూప, . వెంకటస్వామి, . స్వరూప, . సూర్యభగవాన్, . జగదీశ్వర్, సునీతాదత్తా, రజిని, . అఖిల్ కుమార్, . శ్రీలత మరియు ఇతర బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని, విద్యార్థులకు ముందస్తు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.







