గోదావరి తల్లి కన్నీటి గోస 2.0 రూపకర్త బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో వేలాల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడిగడ్డ నుండి కొండపోచమ్మ సాగర్ వరకు 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్రలో భాగంగా ఈ పూజలు చేశారు.
గోదావరి తల్లి కన్నీటి గోస 2.0 రూపకర్త బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో వేలాల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ, మేడిగడ్డ నుండి కొండపోచమ్మ సాగర్ వరకు 400 కిలోమీటర్ల మహా సైకిల్ యాత్రలో భాగంగా వేలాల శ్రీ మల్లన్న స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు. బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరి సాయి కృష్ణ నేతృత్వంలో వేలాలలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్ కుమార్, మేకల నవీన్, గుండబోయిన శ్రీనివాస్, పారుపల్లి అనిల్, కాశీపాక వాసు, ముత్యం అనిల్ గౌడ్, ఆరేపెల్లి సర్వేశ్, సతీష్, మధు పాల్గొన్నారు.












