మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజడులు, గ్యాంగ్ వార్ లు, గ్రూప్ తగాదాలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ లు హైదరాబాద్ లో కాళేశ్వరం జోన్ ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని వారు వినతి పత్రం అందజేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గ్యాంగ్ వార్ లు, గ్రూప్ తగాదాలు, గొడవలతో అలజడులు సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ లు హైదరాబాద్ లో కాళేశ్వరం జోన్ ఐజీ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. బతుకమ్మ పండుగ రోజున మండలం తళ్ళపేట గ్రామంలో జరిగిన గొడవ, దసరా రోజున లింగాపూర్ లో జరిగిన ఘటన, మంచిర్యాల జిల్లాలో పోలీస్ పహారా పెంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, లక్షత్తిపేట్ మండలం వెంకట్రావుపేట ఘటన వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునాథ్ గారు కోరారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు ఐజీ గారిని అభ్యర్థించారు.












