సబ్యూనిట్కు చెందిన హోంగార్డు బి. వెంకటి (హెచ్‌జీ-1071) 35 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుతం ఫింగర్‌ప్రింట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బి. వెంకటి సేవలను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
పోలీస్ శాఖలో 35 సంవత్సరాల పాటు అంకితభావంతో విధులు నిర్వహించినందుకు బి. వెంకటిని కమిషనర్ అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన కుటుంబంతో కలిసి సుఖసంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఆర్.ఐ. పెద్దన్న, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా హోంగార్డ్ ఇన్చార్జ్ ఏఆర్ఎస్ఐ బి. రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.












