పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై కారుతో దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించిన ఏడుగురు నిందితులను లక్సెట్టిపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన లక్సెట్టిపేటలో చోటుచేసుకుంది. నిందితుల నుంచి కారు, బైకులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
మండలం నంబాల గ్రామానికి చెందిన బండె సురేష్ (1), అక్రమ రేషన్ బియ్యం, కలప వ్యాపారం చేస్తున్నాడు. వెల్గనూరుకు చెందిన పర్సినేని అనిల్ (21) తనను అధికారులు పట్టుకోవడానికి కారణమని సురేష్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటల సమయంలో, అనిల్ తన స్నేహితులతో కలిసి లక్సెట్టిపేటలోని మణికంఠ పూజ స్టోర్ వద్ద వినాయక చవితి పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నాడు. ఈ సమయంలో సురేష్ మరో ఆరుగురితో కలిసి కారు, బైకులపై అక్కడికి చేరుకుని కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డాడు.
సురేష్ అనిల్పైకి కారు (02 1011) పోనిచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. అనిల్ తప్పించుకునే ప్రయత్నంలో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అనిల్ గొంతు నొక్కి, విచక్షణారహితంగా తొక్కబోయారు. స్నేహితులు, స్థానికులు అడ్డుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు మోటార్ సైకిళ్లు, రెండు కర్రలు, రెండు ఇనుప రాడ్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.












