కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ () జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి నియమితులయ్యారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ () జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి నియమితులయ్యారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా పూదరి తిరుపతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, ఐఎన్టీయూసీ స్టేట్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.