హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు వివరాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు.
కేసు వివరాల్లోకి వెళితే, తేదీ 02-11-2026న ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి దేవక్క (లక్ష్మయ్య భార్య) తన ఇంటిముందు ఉండగా, స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను రాకేశ్ ఇంటి చిరునామా అడిగారు. అనంతరం ఆమెను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుని, గొంతు పట్టుకుని, అరిస్తే చంపుతామని బెదిరించి, మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని కింద పడేసి స్కూటీపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ..160/2026, /. 309(4) / 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నేరం జరిగిన తీరు
నిందితులైన ముత్యబోయిన ప్రేమ్ చందు, డోలె చంద్రకాంత్ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 31-10-2026, 01-11-2026 తేదీల్లో మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పటికీ దొంగతనానికి అవకాశం లభించలేదు. తేదీ 02-11-2026న ఇద్దరూ 19 2061 నంబరు గల స్కూటీపై హాజీపూర్ మండలం గుడిపేట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న దేవక్క మెడలో బంగారు గొలుసును గమనించి, పథకం ప్రకారం ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.
డోలె చంద్రకాంత్ స్కూటీపై ఉండగా, ప్రేమ్ చందు కిందకు దిగి రాకేశ్ ఇంటి చిరునామా అడిగినట్లు నటించి ఆమెను అడ్డుకున్నాడు. అనంతరం ఆమె గొంతు పట్టుకుని, అరిస్తే చంపుతానని బెదిరించి, మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని కింద పడేసి, చంద్రకాంత్‌తో కలిసి స్కూటీపై పరారయ్యాడు. దొంగిలించిన బంగారు పుస్తెలతాడును కరిగించి ఇచ్చినందుకు కొంత బంగారం ఇస్తామని చాకటి అనిల్ కుమార్‌కు నిందితులు ఫోన్ చేసి ఒప్పందం చేసుకున్నారు.
దీంతో అనిల్ కుమార్ ఆ బంగారు పుస్తెలతాడును మంచిర్యాల పట్టణంలోని ఆర్.పీ. రోడ్డులో మున్సిపల్ కార్యాలయ వాటర్ ట్యాంకు సమీపంలో ఉన్న తన బంగారు ఆభరణాల తయారీ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లి కరిగించి మూడు బంగారు ముద్దలుగా తయారు చేశాడు. అనంతరం ముగ్గురూ ఒక్కొక్క బంగారు ముద్దను పంచుకున్నారు.
నిందితుల వివరాలు
1 ముత్యబోయిన ప్రేమ్ చందు, నివాసం: వెంకటాపురం, ములుగు జిల్లా. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 2 డోలె చంద్రకాంత్, / లక్ష్మయ్య, వయస్సు:32 సంవత్సరాలు, కులం:నేతకాని, వృత్తి:రాపిడో డ్రైవర్, నివాసం:ఇంటి నంబర్- 1-40, దుగినేపల్లి గ్రామం, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. 3 చాకటి అనిల్ కుమార్, / గోవర్ధన్, వయస్సు: 35 సంవత్సరాలు, కులం:గోల్డ్ స్మిత్, వృత్తి:కులవృత్తి, నివాసం:ఇంటి నంబర్- 1-193, ఇందాని గ్రామం, వాంకిడి మండలం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.
అరెస్టు మరియు స్వాధీనం
పోలీసులు ఈ కేసులో 2 డోలె చంద్రకాంత్, 3 చాకటి అనిల్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. 1 ముత్యబోయిన ప్రేమ్ చందు పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితులను సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. 2 డోలె చంద్రకాంత్ వద్ద ఒక బంగారు ముక్క, 19 2061 నంబరు గల సుజుకి అవెనిస్ స్కూటీ, రెడ్మీ నోట్ 11 ప్రో 5 సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 3 చాకటి అనిల్ కుమార్ వద్ద ఒక బంగారు ముక్క, 19 4906 నంబరు గల హోండా యాక్టివా స్కూటీ, ఒక శామ్సంగ్ సెల్‌ఫోన్, మూస, పట్టుకారు స్వాధీనం చేసుకున్నారు.












