మంచేరియల్, 9 September
జిల్లా కేంద్రంలో బుధవారం జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
జిల్లా కేంద్రంలో జాతీయ పోషణ మాసోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నాగలక్ష్మి, అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ, హెల్పర్ లత, తదితరులు పాల్గొన్నారు.










