మంచేరియల్, 2026-06-05
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కలిసి ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తేవడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కలిసి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు ఈ వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి, వైద్యులతో మాట్లాడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ రామచందర్రావు, ప్రతిమ హాస్పిటల్ క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రవీణ్, లక్షెట్టిపేట్ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మంచిర్యాల జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి - వెంకట స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










