Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 24
నీటి సంరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు "తెలంగాణ జలసిరి" కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను శుక్రవారం జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సంయుక్తంగా ఈ పోస్టర్లను ఆవిష్కరించారు.
నీటి సంరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు "తెలంగాణ జలసిరి" కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను శుక్రవారం జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఊట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు. వర్షపు నీరు వృధా కాకుండా నేరుగా భూమిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
"జలసిరి" వాల్ పోస్టర్లను ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రధాన కూడళ్లలో, పంచాయతీ కార్యాలయాల్లో అంటించి విస్తృత ప్రచారం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో బాలయ్య, జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్, పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్, MPDO కార్యాలయ సిబ్బంది ఇంద్రావతి, తిరుపతి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.












