Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 23
అడవే ఊరుగా, ప్రకృతే శ్వాసగా జీవించే ఆదివాసీల జీవన విధానాన్ని, వారి సంస్కృతిని గౌరవించాలని, అడవులను కాపాడుకుంటూ వారికి అండగా నిలవాలని మంజుల పత్తిపాటి తన రచన ద్వారా పిలుపునిచ్చారు. వారి ఉనికిని కనికరంతో కాకుండా గౌరవంతో చూడాలని ఆమె కోరారు.
వారి గుడిసె చిన్నదై ఉండవచ్చు, కానీ మా హృదయం విశ్వం అంత విశాలం. అడవే వారి ఊరు, ప్రకృతే వారి శ్వాస. కొండలే వారి గోడలు, పచ్చని చెట్ల మధ్యే వారి జీవితం.
నదుల నడకలో నాగరికతను చూసినవాళ్లు, అడవుల నిశ్శబ్దంలో జీవన వేదాన్ని చదివినవాళ్లు. ఆకాశం మొదటి నీలిమను ధరించినవాళ్లు, భూమి తొలి పరిమళాన్ని ఆస్వాదించినవాళ్లు.
పక్షుల పాటలతో మేల్కొనే వారి ఉదయం. చెట్ల నరికివేతతో వారి సంతోషాన్ని చెరచినాం. వాగుల గలగలలతో సాగే వారి జీవనం. అభివృద్ధి పేరుతో వారి అడుగులు చెరచినాం.
ఓ సమాజమా, వారి ఉనికిని కనికరంతో చూడకు, గౌరవంతో ఆలింగనం చేసుకో. వారి సంస్కృతిని మ్యూజియంలో దాచకు, భవిష్యత్తు తరాలకు వెలుగుగా అందించుకో.
అడవులని కాపాడుకుందాం, ఆదివాసిలకు అండగా నిలుద్దాం.
రచన: మంజుల పత్తిపాటి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చరవాణి 9347042218.












