మంచేరియల్, 2026-07-27
మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రఘునాథ్ వెరబెల్లి హాజరై విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్, జామెట్రీ బాక్సులు అందజేశారు.
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్స్ (బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్) అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రఘునాథ్ వెరబెల్లి హాజరై విద్యార్థులకు కిట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ నేత మాట్లాడుతూ, విద్యార్థులు జీవిత లక్ష్యాలను ఎంచుకోవడానికి పదవ తరగతి పునాది వంటిదని అన్నారు. విద్యార్థులు ఇప్పుడే తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. ఉన్నత విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మంచిర్యాల బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, రంగ శ్రీశైలం, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బోట్ల సత్యం, కమలాకర్ రావు, తరుణ్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి రమేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












