తెలంగాణ, 5 September
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి సేవలు అమూల్యమైనవని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
*ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు-మంత్రి వాకిటి శ్రీహరి* సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు, మంచి విలువలు, క్రమశిక్షణ, మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవి. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, గొప్ప ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు-మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి, వారిని దేశ ప్రగతిలో భాగస్వాములను చేస్తున్న ప్రతి గురువుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.











