మంచేరియల్, 3 September
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల గార్డెన్లో అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల గార్డెన్లో అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తూ, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థి దశలో క్రమశిక్షణ, పట్టుదల, కృషితో ముందుకు సాగి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, టిపిసిసి సభ్యులు నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, కళాశాల కరస్పాండెంట్ రమణ, ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధాతి- గిరీష్ , మానయ్య ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు..












