మంచిర్యాల (ప్రజావార్త) ఆగస్టు 10
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ఐ హైమ సూచించారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోని క్యాతనపెల్లిలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బాలుర హాస్టల్లో విద్యార్థులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, షి టీమ్ ప్రాముఖ్యత, విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అవగాహన కల్పించిన అంశాలు
ఈ సందర్భంగా జిల్లా షి టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, జిల్లాలో షి టీమ్ పాత్ర, దాని విధులు, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, వాటి పరిణామాలు, ఈవ్ టీజింగ్, - అప్లికేషన్, చట్టం, సోషల్ మీడియా ప్రభావం, సైబర్ క్రైమ్స్, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, డయల్ 100 ప్రాముఖ్యత వంటి అనేక అంశాలపై విద్యార్థులకు వివరించారు.
నేరాల నుంచి రక్షణ మార్గాలు
సమాజంలో నెలకొన్న రుగ్మతలు, జరుగుతున్న నేరాల నుంచి ఎలా రక్షణ పొందాలి, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టనష్టాలపై కూడా వివరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
తక్షణ ఫిర్యాదుకు సూచన
ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా, మహిళలను వేధిస్తున్నా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడుతున్నా, ఉద్దేశపూర్వకంగా వెంబడిస్తున్నా వెంటనే 100 నంబర్‌కు లేదా రామగుండం షి టీమ్ నంబర్ 6303923700 కు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ అవగాహన కార్యక్రమంలో షి టీమ్ కానిస్టేబుల్స్ శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి షి టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.