Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 18
జైపూమడలలోనిేలలగమీమలలననసమిదేలయనచిసమిసపదయబదధగగగసనననిిబయలదే.ఒగగపూజలేదమతోచఛణల,డోలచపపళలమధయసమిినిభతలఊేగిపగతీసెళల.ఈయమలోగమసపచ,ఉపసపచ,డసభయల,ఆలయమిటీసభయలపలగొనన.
జైపూర్ మండలంలోని వేలాల గ్రామ శ్రీ మల్లన్న స్వామి దేవాలయం నుంచిస్వామి వారు సంప్రదాయబద్ధంగా గంగ స్నానానికి బయలుదేరారు. ఒగ్గు పూజారుల వేద మంత్రోచ్ఛారణలు, డోలు చప్పుళ్ల మధ్య స్వామి వారిని భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
పసుపు వస్త్రాలు ధరించిన భక్తులు, గ్రామ పెద్దలు "బోలో మల్లన్న మహారాజ్ కి జై" అంటూ జయజయ ధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












