మంచేరియల్, 01/2026
క్యాతన్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని గద్దెరాగడిలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్యాతన్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గద్దెరాగడి లో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగలో స్థానిక పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ముదిరాజ్ కుటుంబాల ఇంటి నుండి తెచ్చిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












