వేసవి తాపాన్ని తగ్గించేందుకు మంచిర్యాలలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. కీ.శే. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ వంటి జనసమ్మర్ధం ఉండే ప్రాంతాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న దాహార్తిని తీర్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చలివేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.








