మంచేరియల్, 2026-07-31
కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో ACTO గా పదవీ విరమణ పొందిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ ను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సహకారం ఉంటుందని ఆకాంక్షించారు.
కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో ACTO గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, టీఎన్జీవో మంచిర్యాల జిల్లాకు, హౌసింగ్ సొసైటీకి రామ్మోహన్ చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా మంచిర్యాల టీఎన్జీవోకు రామ్మోహన్ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో కలిసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో టిఎన్జీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ సంద అశోక్, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ కందుకూరి సురేష్ బాబు, మాజీ కార్యదర్శి శ్రీ పుప్పాల హనుమంతరావు, జగిత్యాల టీ జి ఓ యూనియన్ అధ్యక్షులు శ్రీ కందుకూరి రవి బాబు, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, కోశాధికారీ శ్రీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, శివ ప్రసాద్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శి సునీత, పద్మ లత, ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.












