అరుణ్ కుమార్, V9 న్యూస్ చైర్మన్, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ, అనేక మంది ప్రజల అభిమానాన్ని సంపాదించారు.
నిజాయితీగల జర్నలిస్టుగా పేరుపొందిన అరుణ్ కుమార్, V9 న్యూస్‌ను స్థాపించి, కేవలం ఒక్క సంవత్సరంలోనే ప్రజల ప్రేమను చూరగొన్నాడు. ఆయన తన బాధ్యతలతో పాటు 'ప్రజావార్త' మరియు 'అక్షర వేకువ' దిన పత్రికలను ప్రజల ముందుకు తీసుకొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి, బాధితుల పక్షాన నిలబడుతున్నాడు. ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చిన వారిపై పోరాడుతున్నాడు.
V9 న్యూస్ టీమ్‌ను బలోపేతం చేసి, అన్యాయాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమై పోరాడుతున్నాడు. అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తూ, మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు.











