మండలం తాళ్లపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. బతుకమ్మ ఆడుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ రమణమూర్తి దాడి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే తాళ్లపేట గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు గ్రామస్తులు ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాతెన జగన్మోహన్రావు తాళ్లపేటలో పర్యటించి, గిరిజన మహిళా సర్పంచ్‌తో పాటు బాధిత మహిళలను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని, వారికి అండగా నిలిచారు.
గిరిజన మహిళా సర్పంచ్‌పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో తాళ్లపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బతుకమ్మ వేడుకల సందర్భంగా జరిగిన ఘటనపై అధికారులు వెంటనే స్పందించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.



