బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా మంచిర్యాల జిల్లాలో బీసీ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీసీలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
బీసీలను సంఘటితపరచడం, చైతన్యవంతులను చేయడం, మన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సమాజ్ తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల బీసీలకు ఎదురవుతున్న సమస్యలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీలకు న్యాయమైన వాటా వంటి అంశాలపై బీసీ యువతీ యువకులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులలో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
బీసీ రాజ్యాధికార సాధన దిశగా బీసీలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని బీసీ సమాజ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువతీ యువకులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి బీసీ ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, మహిళా నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వృత్తి సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, బీసీ హక్కుల కోసం పోరాడే ప్రతి ఉద్యమకారుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ కుల సంఘం నాయకుడు, ప్రతి బీసీ ప్రజాప్రతినిధి, ప్రతి బీసీ ఉద్యోగి, ప్రతి బీసీ యువతీ యువకుడు, ప్రతి బీసీ విద్యార్థి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. మన హక్కుల కోసం మనమే గొంతెత్తాలి, మన సమస్యలపై మనమే పోరాడాలి, మన భవిష్యత్తు కోసం మనమే సంఘటితమవ్వాలి అని పిలుపునిచ్చారు.
బీసీల ఐక్యతను చాటుదాం, బీసీలలో చైతన్యాన్ని నింపుదాం, బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం, బీసీ రాజ్యాధికార సాధన దిశగా అడుగులు వేద్దాం అని, రండి, తరలిరండి, బీసీ అలై బలై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.












