ఎంప్లాయిమెంట్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన శ్రీ యతిపతి రమేష్ బాబు, టిఎన్జీవో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, పుణ్య దంపతులను టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఎన్జీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ సంద అశోక్ విచ్చేసి, రమేష్ బాబు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియార శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ యతిపతి రమేష్ బాబు ఎంప్లాయిమెంట్ శాఖలో ఉత్తమ సేవలు అందించారని, ఆ శాఖకు వన్నె తెచ్చే విధంగా పని చేశారని కొనియాడారు. ఆయన సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. అదేవిధంగా టీఎన్జీవో జిల్లా శాఖలో వివిధ హోదాలలో రమేష్ బాబు అందించిన సేవలు వెలకట్టలేనివని శ్రీహరి పేర్కొన్నారు. శ్రీ రమేష్ బాబు శేష జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో, మనవళ్లు, మనవరాళ్లతో సుఖ సంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా మాజీ కార్యదర్శి శ్రీ పుప్పాల హనుమంతరావు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.











