మంచేరియల్, 15-07-2026
59వ డివిజన్ ప్రజలకు SIR ఫారాలపై అవగాహన కల్పించేందుకు కార్పొరేటర్ శ్రీ మాదంశెట్టి సత్యనారాయణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SIR ఫారం ఎలా నింపాలో తెలియని వారికి కార్పొరేటర్ స్వయంగా అవగాహన కల్పించి, అక్కడికక్కడే ఫారాలు నింపి పూర్తి చేస్తున్నారు.
59వ డివిజన్ ప్రజలకు SIR ఫారాలపై అవగాహన కల్పించేందుకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ మాదంశెట్టి సత్యనారాయణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. SIR ఫారం ఎలా నింపాలో తెలియని వారికి కార్పొరేటర్ స్వయంగా అవగాహన కల్పించి, అక్కడికక్కడే ఫారాలు నింపి పూర్తి చేస్తున్నారు.
ప్రజలు సులభంగా సేవలు పొందేందుకు డివిజన్లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి: అంగన్వాడి కేంద్రం - రాజేష్ హోటల్, IB ఏరియా, శ్రీనివాస టాకీస్ రోడ్డు, వెంకటేశ్వర టాకీస్ రోడ్డు; మరియు అంగన్వాడి కేంద్రం - చింతపండు వాడ.
సేవా కేంద్రాలలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు, మరియు మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని 59వ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.











