*లక్షెట్టిపేట (ప్రజావార్త) సెప్టెంబర్ 02
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేటలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, విశ్రాంతి భవన్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టారు.
👉*PRESS NOTE*
*లక్షెట్టిపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు*
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, అనంతరం లక్షటిపేట విశ్రాంతి భవన్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పెద్దపల్లి మరియు అదిలాబాద్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీని లక్షెట్టిపేటలో మరింత బలోపేతం చేసి, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మంథని సంపత్ గారు, మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు నల్లతీగల మహేష్ గారు, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రక్షిత్ వర్మ, జిల్లా నాయకులు దినేష్ వర్మ, కంటెస్టెంట్ అభ్యర్థులు చింతల రంజిత్, రాచర్ల రాకేష్, పిట్టల నరేష్, మరియు గుడిసెల సాయి, అవునూరి కిరణ్, మహేష్, చుంచు సాయి, కట్ట సంతోష్, ఆషిక, ఆవుల వెంకటేష్, రాజశేఖర్, రఘు, సిద్దు, సమీర్, ప్రేమ, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.








