పెద్దపల్లి, 10 October
ప్రస్తుత వర్షాకాలం పంటల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద శనివారం విడుదల చేశారు. రేవెల్లి డిస్ట్రిబ్యూటరీలోని డి-86, డి-83 మెయిన్ కెనాల్ల ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటలకు సోమవారం వరకు నీరు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు.
ప్రస్తుత వర్షాకాలం పంటలకు గాను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని ఈరోజు శనివారం నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద విడుదల చేయడం జరిగింది. రేవెల్లి డిస్ట్రిబ్యూటరీ నుండి డి-86, డి-83 మెయిన్ కెనాల్ల ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటలకు సోమవారం వరకు శ్రీరామ్ సాగర్ నీరు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు తెలిపారు.
ఎలినోవ ప్రభావంతో సాగునీరు సమస్య ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పంటలను ఎలాగైనా కాపాడాలనే దృఢ నిశ్చయంతో ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలకు కృషి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పంటలు చేతికి వచ్చేవరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే గారు కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పొదుపుగా సాగునీటిని వాడుకోవాలని సూచించారు.
నీటి విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గార్లకు విజయ రమణారావు గారు కృతజ్ఞతలు తెలిపారు.












