జైపూర్, 29.07.2026
ిిండిసభవషపథంైపూమండపఅపమంఉండిఎంపడవశిసణఎంపఓశశపిబపవసూచించమండంిపమవపంిపవహిసంపఅవసంఇళళండిబటవివచెవవవెళవిహెచచించెండమూడఅిభవషిసఅవశంఉంటటపంపసషిపంివెళిసూచించ
నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఎంపీడీవో శ్రీ జి.సత్యనారాయణ మరియు ఎంపీవో శ్రీ శ్రీపతి బాపురావు జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నందున, అవసరమైతే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావద్దని, వాగులు, చెరువులవ వద్దకు గోదావరి పరిసర ప్రాంతాలకు మత్స్యకారులు, గ్రామ ప్రజలు వెళ్ళవద్దని వారు కోరారు.
రసూల్ పల్లె వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు వెంటనే స్పందించి జేసీబీ ద్వారా నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు.
టేకుమట్ల వాగు, కుందారం పెద్దవాగులు భారీ వర్షాల వల్ల రోడ్డుపైనుండి ఉదృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు, సర్పంచ్ వెంటనే స్పందించి, రెండు వాగులను సందర్శించి, పంచాయతీ సిబ్బంది ద్వారా వాగు వంతెనపైనుంచి ఎవరూ వెళ్లకుండా అడ్డుగా ప్లాస్టిక్ జాలీ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త వహించాలని సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు, మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జైపూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలు, చెట్లు, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కోరారు.
పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఎల్లప్పుడూ గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీ జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీ శ్రీపతి బాపు రావు, టేకుమట్ల సర్పంచ్ శ్రీ బల్ల వెంకటేష్, ముదిగుంట సర్పంచ్ శ్రీ ఆకుల రవికుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు టి.శ్రీనివాస్, పి.సురేష్, యల్.ప్రశాంత్, యం.విష్ణువర్ధన్, తదితరులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.











