(టేకుమట్ల)* (ప్రజావార్త) జూలై 29
జైపూర్ మండలం కుందారం (టేకుమట్ల) గ్రామం వద్ద వాగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులో నీటి మట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. దీంతో కుందారం - టేకుమట్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.
జైపూర్ మండలం కుందారం (టేకుమట్ల) గ్రామం వద్ద వాగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులో నీటి మట్టం పెరిగి పొంగిపొర్లుతోంది. దీంతో కుందారం - టేకుమట్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
స్థానిక అధికారులు, గ్రామ సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగు వద్దకు ఎవరూ వెళ్లవద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా ప్రకటన చేశారు. రైతులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
వాగులో నీటి ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని, వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.












