జైపూర్ మండలంలోని కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్ మరియు శివ్వారం గ్రామ పంచాయతీ కార్యాలయంల ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.
ఈ సభలో గౌరవ సర్పంచ్ గార్ల అధ్యక్షతన ఓటర్ లిస్ట్ రివిజన్ (SIR) గురించి చర్చించబడింది. వర్షాకాల సంసిద్ధతపై జాగ్రత్తలు, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు(SWM)- 2026 మరియు ఇతర సామాజిక అంశాలపై వివరించబడింది.
సభలో పాల్గొన్న వారు తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, కంపోస్ట్ ఎరువు తయారుచేయడం వంటి విషయాలపై చర్చించారు.
త్రాగు నీరు, జల సంరక్షణ, మొక్కలు నాటడం, మహిళల భద్రత వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.
సభ అనంతరం, స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.











