మంచేరియల్, 29-07-2026
మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ శ్రీ ధర్ని మధుకర్ సూచనలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు, పాత ఇళ్ల గోడల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల మేయర్ శ్రీ ధర్ని మధుకర్ గారు సూచించారు.
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. పాత ఇళ్ల గోడలు కూలిపోయే అవకాశం ఉన్నందున, అలాంటి ఇళ్లలో నివసిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
అవసరం లేకుండా బయటకు రావద్దని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో వాహనాలు నడపవద్దని మేయర్ సూచించారు. వర్షం కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మున్సిపల్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అన్ని డివిజన్ల కార్పొరేటర్స్ అందరూ తమ డివిజన్లలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలకు కృషి చేయాలని మేయర్ సూచనలు చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.










