Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 25
జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీలో త్రాగునీటి కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను సర్పంచ్ అక్రమంగా వేలం వేశారనే ఫిర్యాదులపై మంచిర్యాల కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా పైపులైన్‌ను పరిశీలించి, దాని వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీ నందు త్రాగునీటి కోసం గోదావరి నది నుండి ఏర్పాటుచేసిన పైపులైనును సర్పంచ్ అక్రమంగా వేలం వేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో, గౌరవ కలెక్టర్, మంచిర్యాల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈ ఫిర్యాదుపై గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మంచిర్యాల గారు తేదీ 25.07.2026న విచారణ నిర్వహించారు.
గ్రామపంచాయతీని సందర్శించి, గోదావరి ఒడ్డున ఉన్న పైపులైన్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్, అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో ఈ పైపులైన్‌ను ఇకపై ఎవరూ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
తదుపరి, గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఇకపై ఈ పైపులైన్‌ను ఎవరూ వాడటానికి వీలు లేదని ఆమోదించి, తీర్మానించారు.
ఈ విచారణలో గౌరవ జిల్లా పంచాయతీ అధికారి శ్రీ డి.వెంకటేశ్వరరావు, గౌరవ EE RWS (మిషన్ భగీరథ) శ్రీ వెంకటేశ్వర్, గౌరవ Dy.EE RWS శ్రీ కిరణ్, గౌరవ ఎంపీడీవో శ్రీ జి.సత్యనారాయణ, గౌరవ ఎంపీఓ శ్రీ శ్రీపతి బాపు రావు, AE RWS శ్రీ N. రాజమల్లయ్య, గౌరవ సర్పంచ్ శ్రీ అంజన్ గౌడ్, గౌరవ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి సృజన, గ్రామ పెద్దలు చల్లా విశ్వంబర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



