లక్షెట్టిపేట మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు నిర్వహించబడ్డది. ఈ సదస్సులో ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఈ రోజు లక్షెట్టిపేట మండలంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సులో నాయబ్ తహసిల్దార్ శ్రీ గడియారం శ్రీహరి పాల్గొన్నారు.
సదస్సులో తహసిల్దార్ శ్రీ దిలీప్ కుమార్ అధ్యక్షత వహించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ మరియు కౌన్సిలర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు.
బిఎల్ఓ, బిఎల్ఏ మరియు సూపర్వైజర్స్ కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలా జరగాలో అవగాహన కల్పించడం జరిగింది.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు ప్రతి ఒక్క బిఎల్వోలు ఇంటింటికి తిరిగి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను 100% పూర్తి చేయాలని సూచించారు.











