మంచేరియల్, 3 September
హైదరాబాద్ లో జరగనున్న చలో హైదరాబాద్ మహా ధర్నాలో పాల్గొనేందుకు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల తరలింపునకు భాగ్యనగర్ వరకు ఒక ప్రత్యేక రైలును కేటాయించాలని ప్రతినిధులు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో, చలో హైదరాబాద్ మహా ధర్నాకు భాగ్యనగర్ రైలు బుకింగ్ కొరకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు, నిరసన కార్యక్రమాలలో భాగంగా చలో హైదరాబాద్ మహా ధర్నాను విజయవంతం చేసేందుకు, నుంచి భాగ్యనగర్ వరకు మొత్తం రైలును తమకే కేటాయించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపు రావు, వైస్ చైర్మన్ నాగుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.












