రామగుండం, 2026-08-31
తమ కుటుంబ క్షేమం కంటే సమాజ క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని, ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఇకపై తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను ఆయన సోమవారం ఘనంగా సత్కరించారు.

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఎం.రవీందర్ (ఎస్ఐ), బసవ దీపక్ (ఏఎస్ఐ), దుంపల కొమురయ్య (ఏఎస్ఐ), చిలుముల మధునయ్య (హెడ్ కానిస్టేబుల్)లను పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, తమ కుటుంబ క్షేమం కంటే సమాజ క్షేమం కోసం పోలీసులు నిరంతరం సేవలందిస్తారని అన్నారు.
ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు తమ విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని తెలిపారు. ఇలాంటి అధికారులు రాబోయే తరం పోలీసులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిత్యం యోగా లేదా వ్యాయామం చేయాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ సుఖసంతోషాలతో, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐ రమేష్, సీసీ సందీప్, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.